Wednesday, May 8, 2024

మేమ్ ఫేమ‌స్ మూవీలో తొమ్మిది సాంగ్స్

‘రైటర్‌ పద్మభూషణ్‌’తో విజయం అందుకున్న తర్వాత లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలిసి చేస్తున్న చిత్రం ‘మే మ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు- దర్శకత్వం వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రధారులు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘మేమ్‌ ఫేమస్‌’ సంగీత ప్రయామం మొదలుకానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ని విడుదల చేయను న్నారు. కళ్యాణ్‌ నాయక్‌ మేమ్‌ ఫేమస్‌ కోసం తొమ్మిది పాటల ను కంపోజ్‌ చేశారు. ఈ పాటలను కాలభైరవ, రాహుల్‌ సిప్లి గంజ్‌ ఒక్కో పాటను పాడారు. గాయని మంగ్లీ మరో పాటని ఆలపించారు. మిగిలిన పాటలను ప్రముఖ గాయకులు పాడారు. ఈ చిత్రం ఫస్ట్‌ సింగిల్‌ ” అయ్యయ్యో…” పాటని ఏప్రి ల్‌ 14న విడుదల చేస్తున్నట్లు- చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పోస్టర్‌ విడుదల చేశారు. శ్యామ్‌ దూపాటి సినిమాటోగ్రఫీ అందిసున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement