Monday, May 13, 2024

రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ మళ్లింపు

హైదరాబాద్ నగరంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణ రేపు జరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ చుట్టూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ ను మళ్లించారు. మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట నుంచి మారియట్ హోటల్ సిగ్నల్, కట్టమైసమ్మ రోడ్, తెలుగుతల్లి ప్లైఓవర్, మింట్ కాంపౌండ్, బడా గణేష్, వీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోటరీ, పీపుల్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, తిరిగి నల్లగుట్ట జంక్షన్ రూట్లు బంద్ ఉంటాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement