Tuesday, May 14, 2024

మణిశర్మ బుక్ అయిపోయాడు !!

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం సీటీ మార్. కాగా ఈ చిత్రానికి సంబంధించి శనివారం జ్వాలా రెడ్డి పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే ఈ పాట కు సంబంధించిన ట్యూన్ సంగీత దర్శకుడు మణిశర్మ కాఫీ కొట్టేసాడంటూ నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు. తెలంగాణ జానపద గేయాలు గొల్ల మల్లమ్మ, కళ్ళజోడు కాలేజీ పాప పాటలు ట్యూన్ వాడేసి జ్వాల రెడ్డి పాటను క్రియేట్ చేశారని మణిశర్మ పై సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఇటీవలే లవ్ స్టొరీ సినిమాకు సంబంధించి సారంగదరియా సాంగ్ పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కోమలి అనే జానపద గాయని మా పాటను వాడుకొని సుద్దాల అశోక్ తేజ క్రెడిట్ తీసుకున్నారని మాకు న్యాయం కావాలంటూ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement