Saturday, May 18, 2024

బ్యాలెట్ బాక్సుల్లో ‘విశాఖ ఉక్కు’ నినాదం

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు తెరిచి చూడగా అందులో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని నినాదాలు రాసిన స్లిప్పులు కనిపించాయి. దీంతో బ్యాలెట్ పత్రాల నుంచి వాటిని వేరుచేశారు. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు కొన్నిచోట్ల వెలువడిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు:

✿తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿గిద్దలూరు ఏడో వార్డులో 55 ఓట్లతో టీడీపీ అభ్యర్థి విజయం
✿ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైసీపీ గెలుపు
✿ముమ్మిడివరం 5,6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం
✿పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైసీపీ గెలుపు
✿యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైసీపీ గెలుపు

✿చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైసీపీ గెలుపు
✿బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైసీపీ గెలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement