Saturday, May 4, 2024

ఓకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని, నాగచైతన్య ?

కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీష్ సినిమాలు ఆఖరి నిమిషంలో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి . కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ రెండు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఒకే తారీఖున రిలీజ్ కాబోతున్నాయట.

సెప్టెంబర్ 10న వినాయక చతుర్థి పండగ సందర్భంగా ఈ రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. ఇక టక్ జగదీష్ సినిమాలో నాని సరసన రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిగా… లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య సరసన నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement