Sunday, May 5, 2024

ప్రమోషన్స్ పై ఫోకస్ చేసిన రాధే శ్యామ్

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా వచ్చే ఏడాదికి ఈ సినిమాను షిఫ్ట్ చేశారు. అయితే ఇప్పటి నుంచే ఈ చిత్రం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం… సెప్టెంబర్ నెల నుంచి మేకర్ ప్రమోషన్స్ ని ప్లానింగ్ ప్రకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ వరకు కూడా అదిరిపోయే విధంగా ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై హైప్ ను పెంచనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement