Friday, April 26, 2024

కృష్ణానదిలో ఇరుక్కుపోయిన ఇసుక లారీలు

కృష్ణాజిల్లా నందిగామలో కృష్ణానదిలో అకస్మాత్తుగా పెరిగిన వరదలో ఇసుక లారీలు చిక్కుకున్నాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వందకు పైగా లారీలు వెళ్లాయి. అయితే, అకస్మాత్తుగా వరద రావడంతో వరద నీటిలో లారీలు నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద నీటికి కొట్టుకుపోవడం వల్ల వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.

సుమారు 150 మంది డ్రైవర్లు, కూలీలు రోజువారీ ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి తవ్వకాల నిమిత్తం కృష్ణా నదికి వెళ్ళారు.  ఒక్కసారిగా కృష్ణానది కి వరద ప్రభావం ఎక్కువ అవటంతో కృష్ణా నదిలో 100 లారీలు  150 మంది డ్రైవర్లు,  ఇసుక కూలీలు చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement