Monday, May 6, 2024

క్వారంటైన్ కి రెడీ అవుతున్న బిగ్ బాస్5 కంటెస్టెంట్స్

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో 5వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి ఈ షో మొదలు కానుంది. అయితే ఆగస్టు 15న దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయనున్నారు. ఇక గత రెండు సీజన్ లను హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 22న ఓ స్టార్ హోటల్ కు కంటెస్టెంట్ లు క్వారంటైన్ కు వెళ్తారట. 14 రోజులకు క్వారంటైన్ అయిన తర్వాతే వారు హౌస్ లో అడుగుపెట్టనున్నారట. ఇక ఈ సారి హౌస్ లో అడుగు పెట్టబోయేది వీల్లే అంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు వీరే : లహరి, నవ్య స్వామి, ఉమ, యాంకర్లు వర్షిణి, శివ, లోబో, రవి, ప్రియాంక, నటి ప్రియ, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, నిఖిల్, విజె సన్నీ, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి

Advertisement

తాజా వార్తలు

Advertisement