Monday, May 13, 2024

నానీ “దసరా” ఓటీటీ రిలీజ్ అప్పుడేనా..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దసరా. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ సినిమా. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. థియేట్రికల్ రన్ లో మూడో వారాన్ని పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక చాలా మంది ఈ సినిమా ఓటీటీ స్పేస్‌లో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, ఈ మూవీ వచ్చే నెల మే 30న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, ఝాన్సీ, సాయి కుమార్,సముద్రఖని తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement