Saturday, April 27, 2024

వివాదం ముదిరింది… ప్రకాష్ రాజుకు నాగబాబు మద్దతు

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో రచ్చ మొదలైంది. గతంలో శివాజీరాజా సీనియర్ హీరో నరేష్ మధ్య పోటీ నెలకొనగా ఈసారి ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ల మధ్య రచ్చ ముదురుతోంది. ఇప్పటికే ఎవరు ప్రయత్నాలలో వారు ముందుకు వెళ్తున్నారు. నిన్న మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. మరోవైపు మెగా ఫ్యామిలీ ని లాక్ చేసేందుకు అటు ప్రకాష్ రాజు ఇటు మంచు విష్ణు ఇద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజు పై ప్రశంసలు కురిపించారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి తన మద్దతు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మా అధ్యక్షుడు అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కు లాభం చేకూరుతుందని నేను నమ్ముతున్నాను. ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం. ప్రకాష్ రాజు ఒక నిర్దిష్ట చిత్రపరిశ్రమకు చెందిన వాడు కాదు.. అతను పాన్ ఇండియా నటుడు అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

ఇదిలా ఉండగా జనసేన కు వ్యతిరేకంగా ఉన్న ప్రకాష్ రాజు కి ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలకడం… ప్రకాష్ రాజ్ చిత్రపరిశ్రమ సంక్షేమం కోసం కృషి చేస్తారు అనడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement