Saturday, April 27, 2024

తరుణ్ భాస్కర్ తో నాగ చైతన్య సినిమా ?

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాతో మంచి సూపర్ డూపర్ హిట్ ని కూడా అందుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్య తో తరుణ్ భాస్కర్ సినిమా చేయబోతున్నారట. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని…లడక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాగచైతన్య స్క్రిప్ట్ వినబోతున్నట్లు తెలుస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న చైతుకు ఈ కథ నచ్చితే వచ్చే ఏడాది ఇది ప్రారంభ మయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement