Monday, March 25, 2024

ఒకే ఒక జీవితం మోషన్ పోస్టర్

ప్రస్తుతం శర్వానంద్ మహాసముద్రం సినిమా తో పాటు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలో పాట పాడటానికి ఆది ని స్టేజ్ మీదకు పిలవగా హీరోయిన్ కూడా వెళ్ళమని ప్రోత్సహిస్తుంది.

అయితే స్టేజ్ దగ్గర క్రౌడ్ గోల ఎక్కువ ఉండటం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ ను చూపించారు. అలాగే ఓ టేప్ రీకార్డర్ ను చూపిస్తూ..కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో వీడియోను డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement