Sunday, May 5, 2024

సెకండ్ షెడ్యూల్ కు నాగ్ రెడి

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యుల్ పూర్తయింది. ఇప్పుడు తర్వాత షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నిజానికి ఈ సెకండ్ షెడ్యూల్ కూడా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ ను వాయిదా వేశారు.

కాగా జూన్ మొదటి వారం నుంచి ఈ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల గరుడువేగ సినిమా తో ప్రవీణ్ సత్తారు మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement