Thursday, April 25, 2024

నిరంత‌రాయంగా రామ‌న్న భ‌రోసా

హైదరాబాద్‌, : కరోనా సెకండ్‌ వేవ్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కొవిడ్‌ బాధితులకు చేసే సహాయం కొనసాగుతోంది. కొవిడ్‌ నుంచి పూర్తిగా ఇటీవలే కోలుకున్న ఆయన సోషల్‌ మీడియాలో మళ్లి యాక్టివ్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఇంజక్షన్లు, మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఏవీ కావాలని అడిగినా వెంటనే స్పందించి తన కార్యాలయానికి ఆ పనిని అప్పగిస్తున్నారు. తన వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది ఆ పనిని పూర్తి చేసే వరకు స్వయంగా పర్యవేక్షించి అవసరార్థులకు సాయ ం అందిస్తున్నారు. శని, ఆది వారాల్లో ట్విట్టర్‌ వేదికగా పలువురికి కేటీఆర్‌ రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌లు, ప్లాస్మా తదితర కొవిడ్‌ సంబంధిత అవసరాలు తీర్చారు.
వైజాగ్‌ వాసి వేడుకోలు… ఏపీ మంత్రికి మేకపాటికి కేటీఆర్‌ రిక్వెస్ట్‌
తన తండ్రి వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడంటూ ఒక యువకుడు ట్వీట్‌ చేస్తూ చివరి ప్రయత్నంగా తనకు డీఆర్డీఓ రూపొందించిన 2 డీజీ డ్రగ్‌ కావాలని అడగగా తన స్నేహితుడు మేకపాటి గౌతమ్‌ సాయం చేస్తారని ఆ యువకునికి సమాధానమిచ్చారు. వెంటనే ఏపీ మంత్రి స్పందించి తాను ఆ సమస్యపై దృష్టి సారిస్తానని కేటీఆర్‌కు మాటిచ్చారు. అలాగే పలువురు ఏపీకి చెందిన వారు ట్విట్టర్‌లో కేటీఆర్‌ను సాయమడగగా అక్కడి మంత్రి మేకపాటి గౌతమ్‌కు ఆ పనులు అప్పగించారు.
జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌కు కేటీఆర్‌ విజ్ఞపి
కొవిడ్‌తో జార్ఖండ్‌లో చికిత్స పొందుతున్న ఒక యువతిని హైదరాబాద్‌కు ఎయిర్‌ లిఫ్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, బెడ్‌ ఇవ్వగలిగితే వస్తారని కేటీఆర్‌కు ఆ యువతి స్నేహితుడు విజ్ఞప్తి చేయగా వెంటనే ఆ విషయాన్ని కేటీఆర్‌ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ దృష్టికి ట్విట్టర్‌లో తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement