Thursday, April 25, 2024

మ‌రింత ప‌టిష్టంగా లాక్ డౌన్…

హైదరాబాద్‌, : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమల య్యేలా పోలీసు యంత్రాంగం సన్నద్దమవుతోంది. ఉదయం పూట నాలుగు గంటల సడలింపు సమయంలో ప్రజలు కుప్పలు కుప్పలుగా రోడ్లపైకి రావడం, అందుకే పాజిటివ్‌ లక్షణాలున్న వారు కూడా ఉంటుండటంతో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరుకుల కోసమన్న పేరుతో చాలా మంది ఉదయం పూట రోడ్లపైకి వస్తుండటాన్ని ఎక్కడికక్కడే కట్టడి చేయాలని నిర్ణయించారు. ఇదే సమ యంలో మార్కెట్లు రద్దీ లేకుండా ఉండేందుకు వీలుగా నిత్యా వసరాలు, ప్రధానంగా కూరగాయలు, పండ్లు ఇతరత్రా సరుకు లు వేర్వేరు చోట్ల అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్ణయిం చారు. ఇందుకోసం స్థానిక సంస్థలకు చెందిన ప్రభుత్వ యం త్రాంగం సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించారు.
లాక్‌డౌన్‌ సడలింపు ఉదయం గం. 6 నుంచి 10 వరకు ఉన్నప్పటికీ చాలా మంది ఉదయం గం. 11, మధ్యాహ్నం గం. 12 ల వరకు తిరుగుతున్నారు. ఇలా కాకుండా ఖచ్చితంగా ప్రజలంతా గం.10 కల్లా ఇళ్ళల్లో ఉండేలా మార్కెట్లను తెరచి ఉంచేలా చూడాలని భావిస్తున్నారు. అదే విధంగా లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై గతంలో మాదిరిగా లాఠీలకు పని చెప్పకుండా స్మార్ట్‌ పోలీసింగ్‌ ద్వారా కట్టడి చేస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వారిపై లాఠీలు ఝళిపించకుండా సీసీ కెమెరాలు, హ్యాండీకామ్‌లు, ట్రాఫిక్‌ పోలీసుల కెమరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా గుర్తించి కేసులను నమోదు చేసే ప్రక్రియను మరింత ముమ్మరం చేయనున్నారు. కాలనీలు, బస్తీలలోనే పోలీసుల పికెట్లను, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక యువజన సంఘాలు, బస్తీ సంఘాల సహకారంతో సరుకుల కోసం ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే బయటకు వచ్చేలా చూసే విధానాన్ని అమలు చేయబోతున్నారు. మార్కెట్లలో తీవ్ర రద్దీ ఏర్పడటంతో వ్యాధి మరింతగా విస్తరించే ప్రమాదం ఉందంటూ నిపుణులు ఆందోళన వ్యకం చేస్తుండటంతో కట్టడికి వీలైనన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ భావిస్తోంది. మాస్క్‌లేకుండా కాలనీలలో తిరుగుతున్న వారిపై కూడా కేసులను నమోదు చేయాలని ఆదేశాలు అందాయి.
జిల్లాలలో కొంత మేర లాక్‌డౌన్‌ అమలవుతున్న హైదరా బాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణా లలో ఇబ్బందులు ఎదరువు తున్నా యని పోలీసు అధికారులు అంటున్నా రు. చిన్న చిన్న కారణాలను చూపి ప్రజలు రోడ్లపైకి విచ్చలవిడిగా వస్తున్నారని, కొన్ని చోట్ల పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెక్‌ పోస్టులు లేని రహదారులు, గల్లిdలను ఎంచు కుని వాహనాలపై ఛక్కర్లు కొడుతు న్నారని పేర్కొంటు న్నారు. ఇలా తిరుగు తున్న వారిని పోలీసులు పట్టుకుంటే అనారోగ్యమనీ, ఆస్పత్రులకు వెళ్తున్నామని చెప్పి తప్పించుకుం టున్నారని తెలిపారు.
ఇక మార్కెట్‌కు వచ్చే సమయంలో కొంత మంది మాస్క్‌లు లేకుండా వస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంటి దగ్గరే కదా అని వచ్చామని, మరిచిపోయి వచ్చా మని పిట్టథలు చెబుతున్నా రని పోలీసులు అంటున్నారు.
అదే విధగా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించా లన్న నిబంధన లను ఎవరూ పట్టించుకోవడం లేదని, షాప్‌లు, మాల్స్‌ దగ్గర మార్కింగ్‌ ఉన్నప్పటికీ తమకు వర్తించదన్నట్లు వ్యవహరిసు ్తన్నారని చెబుతున్నారు. గ్రేటర్‌ హై దరా బాద్‌ పరి ధి అంటే మూడు కమిష నరెెట్ల లోనే దాదా పు 350 చెక్‌పోస్టు లను ఏర్పాటు చేశా రు. అయినప్పటికీ వాహనదారులు ఏ మాత్రం ఖాతర్‌ చేయకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు.
మాస్క్‌ లేకపోతే
రూ.1000 జరిమానా
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉండటం, గాలిలో వ్యాధి వ్యాపిస్తుందని నిపుణు లు చెబుతుండటం, మాస్క్‌ ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సూచిస్తుండ టంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌ను తప్పనిసరిగా ధరించా లని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై కేసు నమోదు చేయడం తో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించా లని ప్రభుత్వం ఆదేశిం చింది. అయిన ప్ప టికీ చాలా మంది మాస్క్‌ ధరించేందుకు విముఖత చూపుతున్నారు, నిబంధనలు అమలులోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌ సిటీ పోలీసులు మాస్క్‌ ధరించని వారిపై 65 వేల కేసులను నమోదు చేశారు. వీరందరిపై కేసులను నమోదు చేశారు. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన బుధ వారం నుంచి ఆదివారం వరకు మాస్క్‌ లేకుండా రోడ్లపై తిరుగు తున్న వారిపై 7 వేల కేసులను నమోదు చేశారు. వీరందరికీ వెయ్యి రూపాయల జరిమానాను విధించారు. అదే విధంగా పబ్లిక్‌ గ్యాదరింగ్‌ కేసులను కూడా నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో సిగరెట్‌ తాగడం, గుట్కా తిని ఉమ్మివేయడం, మద్యం తాగడం తదితర నేరాల కింద దాదా పు 10 వేల కేసులను కూడా కేసులను నమోదు చేశారు.
రెచ్చిపోతున్న చైన్‌ స్నాచర్లు
లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి వస్తుండటంతో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గడచిన మూడు రోజులలోనే ఒక్క మేడ్చల్‌ జిల్లాలో ఆరు చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు నేరస్తుల కదలికలపై నిఘాను తీవ్రం చేశారు. పాత నేరస్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. ప్రస్తుతం వారేం చేస్తున్నా రన్న ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్‌తో చాలా మంది స్వం తూళ్ళకు వెళ్ళారు. బస్తీలు, కాలనీలలో తిరుగుతున్న బ్లూకోట్స్‌ పోలీసులు, మొబైల్‌ వ్యాన్‌లలోని సిబ్బంది తాళం వేసిన ఇళ్ళపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పొరుగున వారిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తున్నారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 30 వేల వాహనాలపై పోలీసులు కేసులను నమోదు చేశారు. రాష్ట్రంలో బుధవారం లాక్‌డౌన్‌ మొదలైంది. ఆదివారం వరకు నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 30 వేల మంది వాహనదారులపై కేసులను నమోదు చేశారు. రాచ కొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అయిదువేలు, సైబరా బాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2200, హైదరాబాద్‌ పరిధిలో 8 వేల కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా వరంగల్‌ కమిషనరేట్‌లో దాదాపు 1300 కేసులు కట్టారు. ఇక రాష్ట్రం లోని మిగతా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కూడా వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మార్చి 23 వ తేదీ నుంచి మే 13 వరకు అమలు చేసిన లాక్‌డౌన్‌లో కేవలం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల లోనే దాదా పు 3.25 లక్షల కేసులు వాహనదారులపైనే నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement