Monday, April 29, 2024

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో మార్వెల్‌ స్టూడియోస్‌ షీ-హల్క్‌

ప్రభ న్యూస్‌ : మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌ షీ-హల్క్‌, అటార్నీ ఎట్‌ లా ఆగస్టు 18న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు అండ్‌ మలయాళం భాషల్లో ప్రీమియర్‌తో ప్రసారం కానుంది. మొదటిసారిగా 2008లో ఇన్‌క్రెడిబుల్‌ హల్క్‌ వారసత్వాన్ని వివరంగా అన్వేషిస్తూ, ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నటి టటియానా మస్లానీని జెన్నిఫర్‌ వాల్టర్స్‌ అకా షీ-హల్క్‌గా ఈ సిరీస్‌ ద్వారా పరిచయం చేస్తోంది. షీ-హల్క్‌లో నటుడు మార్క్‌ రుఫలో బ్రూస్‌ బ్యానర్‌, హల్క్‌ లాగా ఐకానిక్‌ పాత్రలో తిరిగి కనిపించారు.

హల్క్‌ను షీ-హల్క్‌ జీవితంలో అవాంఛిత మార్గదర్శి అని పిలిచాడు. ఈసందర్భంగా మార్క్‌ మాట్లాడుతూ… అతను ఆఫర్‌ చేస్తున్న దానితో ఆమెకు సంబంధం లేదన్నారు. కానీ ఆమెకు ఇవ్వబడిన శక్తి , ఆమె జీవితానికి దాని అర్థం ఏమిటో ఆమెకు అర్థం కాలేదన్నారు. అతనితో జీవించడం అంత సులభం కాదని ఆమెకు తెలుసన్నారు. కనుక ఆమెను సాధ్యమైనంత ఉత్తమంగా సిద్ధం చేయడానికి అతను ప్రయత్నించాడన్నారు. వారు గొప్ప అనుబంధాన్ని కలిగి ఉన్నారన్నారు. హల్క్‌ స్థాయిలో ఆమెతో అనుబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్నందుకు బ్రూస్‌ సంతోషిస్తున్నాడని మార్క్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement