Wednesday, May 15, 2024

వెూక్ష సిద్ధి మార్గాలుఋషభోపదేశాలు

శ్రీమహావిష్ణువు ఎత్తిన ఇరవై ఒక్క అవతారాలలో ‘ఋషభు డు’ ఒకటి. ఆ ఋషభుడు తన నూరుగురు పుత్రులకు అనేక విషయాలను ఉపదేశించాడు. ఆ ఉపదేశాన్నే” ఋషభ గీత” అంటారు. నాభి-అతని భార్య మేరుదేవి. వీరు పుత్రసంతానం గురించి యజ్ఞ పురుషు డైన వాసుదేవుణ్ణి పూజించారు. శ్రీహరే తన అంశతో పుత్రుడుగా జన్మించాడు. ఆ బాలుని పేరే ఋషభుడు.
తండ్రి నాభి తరువాత ఋషభుడు రాజు అయ్యాడు. జయం తి అనే కన్యను వివాహం చేసుకొన్నాడు.
ఋషభుడు- జయంతి దంపతులు నూరుగురు పుత్రులను కన్నారు. వారిలో భరతుడు పెద్దవాడు. ఆశ్రమాలతో, పట్టణాలతో, కొండలతో నదులు- చెట్లు, చేమలతో నిండిన ఈ భూమండలం భరతుని పేరు మీదే ”భరతవర్ష”గా పేరు పొందింది.
ఋషుభుడు సంసారిక బంధాలలో చిక్కుకోలేదు. అతి పెద్ద సామ్రాజ్యానికి రాజైనా, సామాన్య మానవుడిలా మెలిగాడు. ధ ర్మం, అర్థం, కీర్తి, సంతతి, ఆనందం, అమృతత్త్వం చక్కగా సాగ డం కోసం గృహస్థాశ్రమం పాటించవలసిందిగా ప్రజలను అను శాశించేవాడు. దేశకాలానుగుణంగా, అత్యంత శ్రద్ధాప్రపత్తులతో అనేక యాగాలు చేసేవాడు. శాంతం స్వభావంతో జీవుల పట్ల మైత్రీ భావంతో ఉండేవాడు.
ఆఖరుకు తన రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పి, మహాత్ము లైన మునులు, పండితులు, పామరుల సమక్షంలో, పుత్రులను ఉద్దేశించి ”నాయనలారా! ఈ గడ్డ మీద పుట్టిన మనుష్యులు కా మానికి లొంగిపోతే, కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు దూరంగా ఉండాలి. తపస్సు వలన బ్రహ్మానందం తప్ప క సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను, స్త్రీలను కాపాడండి. చెడు మార్గాల్లో నడి చే కాముకుల సహవాసం పూర్తిగా వదిలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది. పెద్దల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. పెద్దలైన మహాత్ములు ఎవరని? మీకు సందేహం రావొచ్చు. వీడు విరోధి, వీడు స్నేహతుడు అనే సేవాభావం లేకుండా సమదృష్టి కలవారు, కపటంలేనివారు, దయతో ఉండేవారు మహా త్ములు అని పిలవబడతారు. అటువంటి వారికి వ్యామోహం ఉండదు. ఇంద్రి య సుఖాలకు లోనయినవాడు చేయకూడని పనులు చేస్తూ పాపాలు కొని తెచ్చుకొంటారు. అందువల్ల మీరు పాపాలకు మూలమైన కోరికలను కోర కండి. యదార్థ జ్ఞానం ప్రాప్తించే వరకు మీకు మీ ఆత్మ తత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణంగా దేహకి దు:ఖం ఎక్కువ అవుతుంది. ఈ దేహం ఎంతకాలం ఉంటుందో అంత కాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. వాసుదేవుడు మీద ఆసక్తి కుదరనంత వరకూ మిమ్మల్ని దేహ ధర్మాలు బాధిస్తాయి.
సంసారికి ఇల్లన్నా, భూములన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమ న్నా,” నేను—నాది” అనే వ్యామోహం పెరుగుతుంది.
దీంతో మోక్షమార్గం దూరమవుతుంది. ఎప్పుడైతే మోక్షాసక్తి కలుగు తుందో, అపుడే సంసార బంధాల నుండి బయటకు వస్తాడు. మీకు మోక్షోపా యాలు చెపుతాను. శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుని పై భక్తి కలిగి ఉండడం. కోరికలు లేకపోవడం, సుఖదు:ఖాలలో సహనం, సమస్త జీవుల పట్ల దయతో మెలగడం, భగవద్విషయమైన జ్ఞానం పట్ల ఆస క్తి, తపస్సు, ఎవరితోనూ విరోధ భావం లేకుండా ఉండడం, సర్వత్రా సమ బుద్ధితో ప్రవర్తించడం, శాంతిగా జీవించడం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్త్వం, సత్కార్యాలు యందు శ్రద్ధ, వాక్కులను సంయమ నంతో వాడడం, అన్నింటిలో పరమేశ్వరుని దర్శించడం, ఇవన్నీ మోక్ష మార్గాలు. నా శరీరం ఎలా ఏర్పడిందో మీకు తెలియదు. నా మనస్సు సత్త్వ గుణంతో కూడింది. ధర్మంతో కూడి ఉంది. పాపరహతమైంది. అందువల్లనే ఆర్యులు నన్ను ”ఋషభుడు” అన్నారు (ఋషభు అంటే సర్వో త్తమం, జ్ఞానం, ధర్మం, నిగ్రహం)
నా దేహం పరబ్రహ్మ స్వరూపం. వేదమయం. దీనికి ఆది లేదు. అటు వంటి వేదరూపమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్త్వగుణం కలవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వీ, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు.” అంటై సదాచార సంపన్నులైన కుమా రులకు, లోకానికి వెల్లడించు నిమిత్తం ఆచార వ్యవహారాలను ఋషభుడు ఉపదేశించాడు.మహానుభావుడు, లోకబాంధవుడు అయిన భగవత్‌ స్వరూపం ఋషభుడు రూపంలో కర్మ పరిత్యాగం కావించి, శాంతస్వభావు లైన మునులకు, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన పరమహంస ధర్మాలను ఉపదేశించాడు.
ఆయన తన నూరు మంది పుత్రుల్లో పెద్దవాడు, పరమ భాగవతుడు అ యిన భరతునికు పట్టం కట్టి, ”కుమారులారా! తోడబుట్టిన వాడు, మీ అంద రిలో పెద్దవాడు అయిన భరతుణ్ణి నాలాగే భావించి, సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష.” అని చెప్పి అనంతరం దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలా ప్రవర్తిస్తూ బ్రహ్మవర్తన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో యాడు. జడునిలా, చెవిటివాని లా, మూగవానిలా అవధూత వేషం ధరించి వెళ్ళిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement