Friday, April 26, 2024

ఏ సమయానికైనా రావచ్చు…మహేష్ ఫ్యాన్స్ రెడి గా ఉండండి !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయినప్పటికీ… ఆడియన్స్ నుంచి మాత్రం మంచి ఆదరణ పొందాయి.

అయితే ఈ కాంబినేషన్ పై ఈ రోజు ఓ అప్డేట్ రానుందని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఏ సమయంలో అయినా ఈ కాంబినేషన్ పై అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement