Saturday, April 27, 2024

మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు @మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మహేష్ కు లేడీస్ లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ముంబై బెస్ట్ పాపులర్ మీడియా ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ ఇన్ తెలుగు పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది.

అందులో మహేష్ బాబు మొదటి ప్లేస్ లో నిలిచారు. ఇక సెకండ్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉండగా… మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్, నాలుగవ స్థానంలో ప్రభాస్, ఐదవ స్థానంలో ఎన్టీఆర్, ఆ తర్వాత రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, నాని, చిరంజీవి, రవితేజ ఇలా వరుస స్థానాలలో నిలిచారు. చిరంజీవి మినహా మిగిలిన సీనియర్ హీరోలు ఎవరు కూడా ఇందులో స్థానం దక్కించుకోగా లేకపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement