Wednesday, April 24, 2024

అదంతా అబద్ధం..ఆర్ నారాయణ మూర్తి ఆవేదన

తెలుగు ప్రజలకు ఆర్ నారాయణ మూర్తి సుపరిచితుడే. అయితే హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా సినిమాలు చేసుకుంటూ ఓ సాధారణ వ్యక్తిగా జీవితం గడుపుతూ ఉంటారు ఆర్.నారాయణమూర్తి. అయితే ఆర్ నారాయణ మూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఆర్ నారాయణ మూర్తి స్వయంగా స్పందించారు. నాకు కారు లేదు. నేను ఎక్కడికి వెళ్లాలి అనుకున్న ఆటోలోనే వెళ్తాను. నాకు నెలకు ఎలా లేదన్నా 30 వేల రూపాయలు ఆటోకి ఖర్చు అవుతుంది.

అలాంటిది ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటానా.. ఇలాంటి ప్రచారం నిజంగా బాధపెట్టింది. నన్ను అభిమానించే వారందరూ సాయం చేయడానికి ముందుకు వస్తానంటే బాధగా ఉంది. పల్లెటూరి వాతావరణం నాకు ఇష్టం కాబట్టి సిటీకి దూరంగా ఉంటున్నాను. కోట్లు సంపాదించాను. నాకు కావలసినంత దాచుకుని మిగిలినది దానం చేసేసాను అని చెప్పుకొచ్చారు నారాయణ మూర్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement