Tuesday, May 14, 2024

ఆ రక్తం, తాళిబొట్టు ఏంటి !!! కృష్ణవంశీ కొత్త చిత్రం టైటిల్ చూశారా ?

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా మహాశివరాత్రి సందర్భంగా తన తరువాత చిత్రాన్ని కూడా టైటిల్ తో సహా ప్రకటించాడు కృష్ణవంశీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం గా చెప్తూనే ఒక అరిటాకులో రక్తపు మరకలు, తాళిబొట్టు, వేట కొడవలిని చూపించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని కృష్ణవంశీ తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement