Friday, April 26, 2024

కోట్లు సంపాదించే సమంతకు పాకెట్ మనీ ఇచ్చేవారు: మాధవీలత

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి రోజులు గడుస్తున్నా వారి విడుదలకు సంబంధించిన విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు. వాళ్లు ఈ కారణంగా విడిపోయారు అని కొందరు మరో కారణంగా విడిపోయారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాలా మంది అయిందేదో అయిపోయింది ఇకమీదట అయిన వారిని ప్రైవసీతో ఉండనిద్దామని అనుకున్నా సరే నెటిజన్లు మాత్రం వారిని వదలడం లేదు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది.

మంత చాలా మంచి అమ్మాయి అని, కానీ 100లో 99 శాతం మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమె తప్పుగా చిత్రీకరిస్తూ బాడ్ కామెంట్స్ చేస్తున్నారని అలా చేయవద్దు అని కోరింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టల గురించి విడాకుల దాకా వెళ్ళింది అని కొందరు అంటున్నారు అని అలా అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. సమంత చాలా మంచి అమ్మాయి అని పేర్కొన్న మాధవి లత ఆమె ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీలత చెప్పుకొచ్చారు.

గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం వాడుకున్నాడని ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చింది అని తనకు 30 ఏళ్ల వయసు రాగానే ఒక బిడ్డకు తల్లి కావాలనే విషయాన్ని గతంలో ప్రదీప్ యాంకర్ గా ఉన్న ఒక షోలో వెల్లడించిందని ఆమె పేర్కొంది. దానికి కారణం కూడా ఆమె వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయితే ఆమెకు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అని భావించి ఆమె మనస్సు మార్చి తల్లి కావాలనే ఆమె ఆశలు చంపేశారని మాధవీలత ఆరోపించింది.

కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే సమంతకు వేల రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు తెలుసా అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకప్పుడు ఆమె ఏదైనా షాప్ ఓపెనింగ్ లోకి వెళితే ఆ ఓపెనింగులకు వచ్చే డబ్బు నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయమని చెప్పేది అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆమె చాలా బాధ పడుతోందని మాధవి చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ నేనేదో ఊహించి చెప్పడం లేదని పేర్కొన్న మాధవి లత సమంతకు సన్నిహితులే నాకు ఈ విషయాలు చెప్పారు అని చెప్పుకొచ్చింది. సమంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అందరూ ఆమెను ట్రోల్ చేస్తున్నారని ఆమెకు ఉన్న మంచి మనసులో ఒక్క శాతం మీకు ఉన్నా సరే మీరు గొప్ప వాళ్ళు అవుతారని ఆమె చెప్పుకొచ్చారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement