Sunday, May 5, 2024

తెలంగాణలో రేపటి నుంచి దసరా సెలవులు..

తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం..బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం (అక్టోబర్‌ 6) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఇచ్చినట్టు ప్రకటించింది. రిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి… ఇక, ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు ఉంటాయని వెల్లడించింది… దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఆదేశాలను పట్టించుకోపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తేడా లేకుండా అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయి. కాగా, కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు.. దాదాపు 18 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే.. కోవిడ్ సమయంలో అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కాగా.. ఈ మధ్యే భౌతికతరగతులు ప్రారంభం అయిన విషయం విదితమే.

ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా దళితులు దయనీయ స్థితిలో ఉన్నారు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement