Monday, December 9, 2024

Kangana Raunat : స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌నున్న‌ కంగ‌నా..ఎవ‌రంటే..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, సంచలన నటి కంగనా రనౌత్ స్టార్ హీరో సినిమాలో న‌టించ‌బోతుంది. కంగనారనౌత్‌ తాజాగా నటించిన తేజాస్‌ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తమిళం లోనూ మంచి క్రేజ్‌ ఉన్న ఈమె ఇటీవల తమిళం లో నటించిన చంద్రముఖి-2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడం జరిగిపోయింది. అయితే సినిమా పై కంగనా ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. కంగనా పాత్ర ఎక్కువగా లేదని చాలా ఫీల్ అయ్యారు కూడా.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్‌ మను చిత్రానికి సీక్వెల్‌ తో పాటు విజయ్‌సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్‌సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు.. రెండు ఇండస్ట్రీలో విజయ్ కు మంచి డిమాండ్.. ఈ మధ్య బాలీవుడ్ లో రానిస్తున్నాడు విజయ్ సేతుపతి.. ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement