Saturday, April 27, 2024

కమల్ ఆమెను వద్దనుకుంటున్నాడట !!

జీతు జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దృశ్యం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన నేపథ్యంలోనే ఈ సినిమాకు పలు భాషలలో రీమేక్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే తెలుగు భాష లో విక్టరీ వెంకటేష్ మీనా ప్రధాన పాత్రలు చేశారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలు చేశారు. అలాగే తమిళంలో ఈ సినిమా రీమేక్ లో కమల్ హాసన్ గౌతమి నటించారు. అయితే కమల్ గౌతమి ఒక కప్పు కింద ఉండడం వల్ల ఆ సినిమాను కలిసి చేశారు.

కాగా ఇప్పుడు దృశ్యం2 మళ్లీ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అలాగే దృశ్యం2 ను కమల్ కూడా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే గౌతమి చేసిన పాత్రకి మీనా ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. మీనా తో సంప్రదింపులు కూడా ఇప్పటికే జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement