Tuesday, May 14, 2024

Kalyani : హ‌లో అంటున్న క‌ల్యాణి ….

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కల్యాణీ ప్రియదర్శన్. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతోనే కమర్షియల్‌ గా నిరాశ పరిచింది. అయితే ఇతర భాషల్లో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

రణరంగం తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న కళ్యాణీ ప్రియదర్శన్‌ తమిళ , మలయాళ సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. మరో వైపు ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి సోఫాలో వాలిన తన ఫోటోలు షేర్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు క్యూట్ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో హలో చెబుతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement