Friday, April 26, 2024

హీరో సినిమా డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. హీరో సినిమా తో అశోక్ గల్లా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఇదే విషయాన్ని చెబుతూ జగపతిబాబు డబ్బింగ్ ధియేటర్ లో ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు తో పాటు నరేష్, సత్య, అర్చన సౌందర్య పలువురు కూడా కీలక పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement