Thursday, August 5, 2021

త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ… అనిల్ కుమార్‌ యాదవ్‌పై వేటు?

ఏపీలో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే నామినేటెడ్ పదవుల నియామకాన్ని సీఎం జగన్ చేపట్టారని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించడంతో ఆమెకు ఈసారి మంత్రి పదవి ఖాయమనే వార్తలు షికారు చేస్తున్నాయి. అదే సమయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వేటు పడనుందని సమాచారం.

ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం తలెత్తినప్పుడు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించలేదని సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌కు భక్తుడిగా పేరు ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌పై వేటు తప్పదని తెలుస్తోంది. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఈ వార్త కూడా చదవండి: త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News