Thursday, August 5, 2021

ఎస్ఐ మోసం చేశాడంటూ యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

న్యాయం చేయాల్సిన పోలీసే అన్యాయం చేశాడు. పెళ్లి పేరుతో నయవంచన చేశాడు. హైదరాబాద్ న‌గ‌రంలోని ట‌పాచ‌బుత్ర పోలీసు స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న ఎస్ఐ మ‌ధు త‌న‌ను మోసం చేశాడంటూ ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ ఘ‌ట‌న జులై 15వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ మ‌ధుకు గ‌తంలో వివాహం అయిన‌ప్ప‌టికీ మ‌రో యువ‌తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. అయితే స‌ద‌రు యువ‌తి పెళ్లి ప్ర‌స్తావ‌న తేవ‌డంతో.. గ‌త కొద్ది రోజుల నుంచి ఎస్ఐ ముఖం చాటేస్తున్నాడు. దీంతో త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేయ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. బాధితురాలు య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ స‌భ్యులు బేగంపేట, ట‌పాచ‌బుత్ర‌ పోలీసుల‌తో పాటు ప‌శ్చిమ మండ‌ల డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న సీపీ అంజ‌నీ కుమార్.. ఎస్ఐ మ‌ధును స‌స్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News