Thursday, May 9, 2024

రామ‌బాణం మంచి సినిమా జ‌గ‌ప‌తి బాబు

గోపీచంద్‌, డింపుల్‌ హయతి జంటగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీ-జీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహా నిర్మాత. 5వ తేదీన ‘రామబాణం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరో జగపతి బాబు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పం చుకున్నారు.
రామబాణం లో మీకు నచ్చి న అంశాలు ? ఇప్పుడన్నీ హారర్‌, యాక్షన్‌, థ్రిల్లర్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా వచ్చి చాలా కాలమైంది. అలాగే గోపీచంద్‌, శ్రీవాస్‌, నేను కలిసి లక్ష్యం చేశాం. ఇది మెయిన్‌ ఎట్రాక్షన్‌. అలాగే రామబాణంలో అన్నదమ్ముల కాన్సెప్ట్‌ అద్భుతంగా కుదిరింది. గతంలో చేసిన శివరామరాజు కూడా కూడా అన్నదమ్ముల కథే. ఓ మంచి సినిమా చూసామనే అనుభూతిని కలిగిస్తుంది రామబాణం.

మళ్ళీ పాజిటివ్‌ పాత్రల వైపు రావడానికి కారణం ?
నేను యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్‌ యాక్టర్‌ని. డైరెక్టర్‌కి ఏం కావాలో వాళ్ళ కళ్ళలో చూస్తే అర్థమౌతుంది. ఆ ఫీల్‌ వచ్చినపుడు ఫెర్‌ఫార్మెన్స్‌ కూడా బావుంటు-ంది ఇప్పుడు మంచి డైరెక్టర్స్‌ వున్నారు.
ఫ్యామిలీ కథలు జనాలు చూడటం లేదనే అభిప్రాయం కూడా వుంది కదా?
రామబాణం గొప్పదనం అదే. ఇప్పుడు సెంటిమెంట్‌ తగ్గిపోయింది. నెగిటివిటీ- పెరిగిపోయింది. సినిమా ఎంత క్రూరంగా వుంటే అంత బావుంటు-ంది. అందుకే నేను సక్సెస్‌ అయ్యాను. అయితే అంత నెగిటివిటీ-లో కూడా పాజిటివిటీ- వుందని చెప్పడానికి వస్తుంది రామబాణం.
ఇప్పుడు ఏదైనా పాత్ర నచ్చక పొతే నో చెప్పగలుగుతున్నారా ?
కాంబినేషన్‌ వుంటే చాలు సెట్‌ ప్రాపర్టీ గా కావాలనుకునే పాత్రలు చేయడం లేదు.
సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మార్కెట్‌, స్టార్‌డమ్‌ పెరిగాయి కదా ?
నా జీవితమే పెరిగింది. ఈ ఫేజ్‌ అన్ని రకాలుగా బావుంది. హీరో అనేది పెద్ద బాధ్యత. ఇప్పుడా ఒత్తిడి లేకపోవడంతో దర్శకుడు కోరుకునే పెర్ఫార్మెన్స్‌ డెలివర్‌ చేయడం ఇంకా సులువవుతుంది.
సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మీకు బాగా నచ్చిన పాత్ర ?
లెజెండ్‌ లో చేసిన పాత్ర. అది అన్‌ బిలివిబుల్‌ క్యారెక్టర్‌. తర్వాత అరవింద సమేత, రంగస్థలం కూడా తృప్తిని ఇచ్చాయి.
రామబాణంలో ఆర్గానిక్‌ ఫుడ్‌ అనే పాయింట్‌ వుంది. మీరు ఆర్గానిక్‌ ఫుడ్‌ ఇష్టప డతారు దాని గురించి ?
ఆర్గానిక్‌ ఫుడ్‌ అనేది లేదు. మనం తినే రైస్‌లో కూడా లేదు. చద్దన్నం యూఎస్‌లో కూడా హెల్తీ ఫుడ్‌. ఆ సెన్స్‌ వస్తుంది. కానీ ఎవరూ సరిగా ఫాలో కావడం లేదు. నాకు చద్దన్నం, పప్పుచారు అన్నం చాలాఇష్టం. ఇప్పటికీ అదే తింటాను.
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు గురించి ?
కంఫర్ట్‌ బుల్‌ నిర్మాతలు. సినిమాకి ఏం కావాలి ఎలా కావాలనేది తెలుసుకొని అన్నీ సమకూర్చే నిర్మాతలు.
ఇంకా చేయాలనుకునే పాత్ర ఉందా ?
నాకు గాడ్‌ ఫాథర్‌ లాంటి పాత్ర చేయాలని వుంది. అలాగే గాయంకు మరో స్థాయిలో వుండే పాత్ర చేయాలని వుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement