Saturday, May 4, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి.. విక్ర‌మ్ సినిమాటోగ్రాఫ‌ర్

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం వీడీ12.. గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ..సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌-శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్‌ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సౌతిండియా టాప్‌ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. పాపులర్‌ మలయాళం సినిమాటోగ్రాఫర్ గిరీష్‌ గంగాధరన్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. గిరీష్‌ గంగాధరన్ గతేడాది విశ్వ న‌టుడు కమల్ హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాకు పనిచేశాడు. అంతేకాదు అంగమలై డైరీస్‌, జల్లికట్టు లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు పనిచేశారు. హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న VD12 చిత్రాన్ని గిరీష్‌ కెమెరా వర్క్‌ మరోస్థాయికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్‌. VD12 రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement