Friday, May 17, 2024

IPL : నేడు ఆర్సీబితో గుజ‌రాత్ టైటాన్స్ ఢీ

ఐపీఎల్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్‌ పోటీ పడబోతుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచ్ లలో అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా మళ్లీ విజయాలను నమోదు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంది. జీటీ గత 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం 10 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, 7 ఓడిపోయి చివరి స్థానంలో ఉంది.

- Advertisement -

బెంగళూరులో వ‌ర్షం..

ఇక, బెంగళూరులో ఈరోజు వర్షం పడే ఛాన్స్ తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, చిన్నస్వామి మైదానం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీ కారణంగా ఈ గ్రౌండ్ లో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా కొట్టొచ్చు. ఇక్కడ స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుందని క్రీడా నిపుణులు అంటున్నారు.

అయితే, చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 88 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో 37 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలవగా.. సెకండ్ బ్యాటింగ్ చేసి జట్లు ఏకంగా 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ఈ మైదానంలో ఛేజింగ్ కే ఎక్కువ లాభదాయకమని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవాళ్టి మ్యాచులో గూగుల్ లో గెలుపు అంచనా ప్రకారం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి 55 శాతం గెలిచే ఛాన్స్ ఉండగా.. గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు 45 శాతం అవకాశం ఉంది.

ఇరు జట్ల అంచనా:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ ( కెప్టెన్ ), విల్ జాక్స్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ ( వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా ( వికెట్ కీపర్), శుభమాన్ గిల్ ( కెప్టెన్ ), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్

Advertisement

తాజా వార్తలు

Advertisement