Friday, May 17, 2024

India :మ‌న‌మే నెంబ‌ర్ వ‌న్..

అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అదరగొట్టింది. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన భారత జట్టు వన్డేలతో పాటు టీ20 ఫార్మాట్‌లో నెంబర్‌-1 స్థానాన్ని నిలబెట్టుకోగా.. టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు తుది పోరులో మాత్రం ఆసీస్‌ చేతిలో ఓడి తృటిలో ప్రపంచకప్‌ ట్రోఫీని చేజార్చుకుంది. అయినప్పటికీ ఓవరాల్‌ ప్రదర్శనలో మాత్రం ఆస్ట్రేలియాను టీమిండియా వెనక్కినెట్టేసింది.

ఐసీసీ ప్రకటించిన వార్షిక టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వన్డేల్లో 122 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్‌కప్‌ విజేత ఆసీస్‌ మాత్రం 116 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (112), పాకిస్తాన్‌ (106), న్యూజిలాండ్‌ (101) పాయింట్లతో టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి. టీ20 ఫార్మాట్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు 264 పాయింట్లతో నెంబర్‌-1 స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఒక స్థానం ఎగబాకి 257 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఒక ప్లెస్‌ దిగజారిన ఇంగ్లండ్‌ టీమ్‌ 252 పాయింట్లతో థార్డ్‌ ప్లెస్‌లో నిలవగా.. దక్షిణా ఫ్రికా (250) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరు నుంచి 4వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ (250) 5వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌ (247) రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

మరోవైపు పసికూన స్కాట్లాండ్‌ (192) జింబాబ్వేను వెనక్కినెట్టి 12వ స్థానానికి చేరుకోగా.. జింబాబ్వే 13వ ర్యాంక్‌కు పడిపోయింది. జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ సమరం జరగనుండటంతో అప్పుడు మళ్లిd పొట్టి ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు జరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మళ్లి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. 2021-23 టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ (105), దక్షిణాఫ్రికా (103), న్యూజిలాండ్‌ (96) పాయింట్లతో వరుసగా టాప్‌-5లో చోటు దక్కించుకు న్నాయి. ఇక 2023-25 సీజన్‌ ప్రపంచ టెస్టు చాంపి యన్‌షిప్‌ పోటీ ల్లో ప్రస్తుతం టీమిండి యా 68.51 విజ య శాతంతో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 62.50 శాతంతో రెండో స్థానంలో ఉంది. వచ్చే ఏడా ది మార్చి వరకు మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో టైటిల్‌ కోసం తలపడుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement