Saturday, May 18, 2024

TS: బీఆర్ఎస్ కు మాజీ ఎంపీ రాపోలు గుడ్ బై..

కేసీఆర్ కు రాజీనామా లేఖ
గులాబీ ఖండువాను స్పీడ్ పోస్ట్
పార్టీ ఆఫీస్ కు పంపిన రాపోలు
హైద‌రాబాద్ – బీఆర్ఎస్ కి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కి పంపారు. రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా అని రాపోలు పేర్కొన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో నా లాంటి నేతలు ఉన్నారని తెలిపారు. 2022 లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరా అని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తుంచుకుంటున్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపానని రాపోలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement