Sunday, April 28, 2024

జొమాటో డెలివరీ బాయ్ కు బాలీవుడ్ హీరోయిన్ సపోర్ట్

జొమాటో డెలివరీ బాయ్ ఇష్యూ ఆసక్తిగా మారింది. బెంగళూరుకు చెందిన హితేషా జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఫుడ్ రావటం ఆలస్యం అవటంతో ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసి ఫుడ్ వద్దని, ఇస్తే ఫ్రీ గా ఇవ్వాలని లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని తెలిపింది. అయితే లాస్ట్ కాల్ కి జొమాటో డెలివరీ బాయ్ వచ్చాడని ఇంత ఆలస్యంగా వస్తే తను ఫుడ్ తీసుకోనని,ఆర్డర్ రద్దు చేస్తున్నానని చెప్పినట్లు హితేషా తెలిపింది. దీంతో డెలివరీ తీసుకొచ్చిన బాయ్ కోపం తో దుర్భాషలాడుతూ తన ముఖం పై దాడి చేసి పరిగెత్తి పారిపోయాడని ఆమె ఆరోపించింది. కానీ డెలివరీ బాయ్ వెర్షన్ వేరేలా ఉంది.

మొదట అందరూ తప్పు డెలివరీ బాయ్ దేనని భావించినప్పటికీ… కామరాజు వివరణ విన్నాక అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా హీరోయిన్ పరిణీతి చోప్రా డెలివరీ బాయ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు. దయచేసి నిజమేంటో తెలుసుకొని రిపోర్ట్ చేయండి. డెలివరీ బాయ్ నిర్దోషి. అతనిని నేను నమ్ముతున్నాను. వెంటనే మహిళను శిక్షించేందుకు సాయపడండి. నేను ఎలా సహాయం చేయవచ్చో తెలపండి అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement