Sunday, April 28, 2024

వచ్చిన అవకాశాలకి నో చెబుతున్న జాతి రత్నాలు హీరోయిన్ ? – టార్గెట్ బాలీవుడ్

జాతి రత్నాలు సినిమాతో ఫేమస్ అయిపోయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అంతకుముందు వరకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసినప్పటికీ క్రేజ్ రాలేదు. కానీ జాతిరత్నాలు సినిమాతో మాత్రం యూత్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అలాగే మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా ఫరియా అబ్దుల్లాకు అవకాశాలు ఇచ్చారట. కానీ ఆ ఆఫర్లకు నో చెప్పిందట ఫరియా. అందుకు కారణం కూడా లేకపోలేదట. ప్రస్తుతం తెలుగు హీరోయిన్లలో ఫరియా పొడవైన అమ్మాయి. ఆరు అడుగులకు పైగానే ఉంటుంది.తెలుగులో ప్రభాస్ రానా మినహా మిగిలిన వారంతా పెద్ద హైట్ ఏమి కాదు. తన కన్న పొట్టిగా ఉన్న హీరోల పక్కన నటించేందుకు ఆమె ఆసక్తి చూపించడం లేదట. దీనితో బాలీవుడ్ సినిమాల్లో ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement