Saturday, April 27, 2024

శ్రీదేవి సోడా సెంటర్ డబ్బింగ్ కంప్లీట్

కరుణ కుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాలో సుదీర్ బాబు సూరి బాబు గా లైటింగ్ బాయ్ పాత్ర పోషిస్తున్నాడు. 70mm బ్యానర్ పై విజయ్ చిల్లా శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా…మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. సూరిబాబు పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెప్పడాన్ని ఎంజాయ్ చేశాను. గ్రేట్ వైబ్స్ అంటూ సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అలాగే ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement