Tuesday, May 14, 2024

రామ్ చరణ్ తో సినిమా పై జెర్సీ దర్శకుడు క్లారిటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఇటీవల రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి.

కాగా ఈ విషయంపై గౌతమ్ తిన్ననూరి స్పందించారు. కొత్త చిత్రం కోసం ఇప్పటి వరకు ఏ హీరో ను కలవలేదు. ఎవరికి నేను కథ నుకూడా చెప్పలేదు. ప్రస్తుతం తాను హిందీ జెర్సీ చిత్రం పైనే ఫోకస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రంతో గౌతమ్ తిన్ననూరి ఎంతటి విజయం సాధించాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement