Thursday, May 2, 2024

ఈనెలలోనే ఓటీటీలో ‘వకీల్ సాబ్’?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కాబోతుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 30 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట డైరెక్టుగా అమెజాన్‌లో విడుదల చేయడానికి 100 కోట్ల ఆఫర్ ను అమెజాన్ సంస్థ ప్రకటించిందట. కానీ నిర్మాతలు థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో ఇప్పుడు 30 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 23 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement