Sunday, May 5, 2024

పుష్ప‌కు మ‌ళ్లీ బ్రెక్

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రాన్ని రిలీజు చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. కాని కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ ఫార్ట్‌ను పుష్ప రైజ్ అనే పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు.

‘పుష్ప’ పార్ట్-1 ఆలస్యమైతే ఆ తేదీకి రావాలని మరికొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప’ చెప్పిన డేట్ కి రాకపోతే మాత్రం.. ‘ఆచార్య’ ను తీసుకెచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా ఆ డేట్ కి రావాలని చూస్తోందట. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను ల ‘అఖండ’ కూడా ఆ తేదీ కోసం చూసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement