Saturday, April 27, 2024

Dalitha Bandhu: దళితబంధ పథకానికి నిధులు విడుదల!

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక దళితబంధ పథకం మళ్లీ ప్రారంభం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ పథకం అమలుకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ నియోజ‌క వ‌ర్గంలో టీఆర్ఎస్ ఓడిన త‌ర్వాత ద‌ళిత బందు ప‌థ‌కాన్ని అమలు చేయ‌ద‌ని ప‌లువురు ప్ర‌తి ప‌క్ష నేత‌లు ఆరోపించారు. అయితే ద‌ళిత బందు ప‌థ‌కాన్ని వందకు వంద శాతం అమ‌లు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ హామీని నిజం చేస్తూ పథకానికి నిధులు విడుదల చేశారు.

ద‌ళిత బందు ప‌థ‌కంతో ఇప్పటికే హుజురాబాద్ లో కొందరు లబ్ధిపొందారు. ఇక ఈ పథకం అమ‌లు చేయ‌డానికి మరో నాలుగు మండ‌లాను ప్రభుత్వం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. చింత‌కాని, తిరుమ‌ల గిరి, చారకొండ‌, నిజాంసాగ‌ర్ మండ‌లాల‌ను ద‌ళిత బందు ప‌థకానికి అమలుకు ఎంచుకున్నారు. ఆ నాలుగు మండ‌లాల్లో ద‌ళిత బందు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది. రూ.250 కోట్లతో ఈ నాలుగు మండ‌ల‌లో ద‌ళిత బందు పథ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. చింతకాని మండ‌లానికి రూ.100 కోట్లు కేటాయించారు. మిగిలిన మూడు మండ‌లాలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఇప్ప‌టికే ఈ నాలుగు మండ‌లాల్లో ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అర్హులను గుర్తించారు. 

ఇది కూడా చదవండి: ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement