Saturday, April 27, 2024

ఫ‌స్ట్ హాలీవుడ్ డెబ్యూట్.. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ షూటింగ్ పూర్తి చేసిని అలియా భట్‌..

అలియా భట్ తన ఫ‌స్ట్ హాలీవుడ్ డెబ్యూ సినిమా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. స్పై థ్రిల్లర్‌గా చిత్రీక‌రించిన ఈ సినిమాకి టామ్ హార్పర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలోని హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ను ఐస్‌లాండ్, లండన్, పోర్చుగల్‌లో చిత్రీకరించారు. కాగా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆలియా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఇది త‌న‌కు మ‌రిచిపోలేని అనుభ‌వం అని.. సెట్స్ పై త‌న మోమోరీస్ ను కూడా ఫేర్ చేసుకుంది ఆలియా.

కాగా, ఆగష్టు 5న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే డార్లింగ్స్‌ మూవీలో ఆలియా కనిపించ‌నుంది. ఆ సినిమాకు ఆమె సహ నిర్మాతగా ప‌నిచేసింది. త‌రువాత సెప్టెంబర్ 9న విడుదల కానున్న‌ బ్రహ్మాస్త్రలో తన భర్త రణబీర్ కపూర్‌తో స్క్రీన్ పై క‌నిపించ‌నుంది. అంతే కాకుండా.. కరణ్ జోహార్ తో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలో కూడా ఆలియా న‌టిస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement