Friday, May 10, 2024

Followup: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు..

కరీంనగర్‌ క్రైం, ప్రభన్యూస్‌: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం(సీపీఓ)కు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌(ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్‌ కమిషనర్‌ వి. సత్యనారాయణకు ధృవీకరణ పత్రం అందజేశారు. కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఐఎస్‌ఓ 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాలయం (సీపీఓ) విభాగంలో తెలుగు రాష్ట్రాలలోనే కరీంనగర్‌ కమిషనరేట్‌ ఎంపికైంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఈఐఎస్‌ఓ గుర్తింపునకు ఎంపిక కావడం బాధ్యతను మరింత పెంచిందన్నారు.

ఈ గుర్తింపుతో కమిషనర్‌ పోలీస్‌ కార్యాలయానికి చెందిన అన్ని స్థాయిలకు చెందిన అధికారులు, సిబ్బందిలో నూతన ఉత్సాహం నిండుకుందని చెప్పారు. మరిన్ని సమర్థవంతమైన సేవలం దించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌. శ్రీనివాస్‌ (ఎల్‌అండ్‌ఓ) జి. చంద్రమోహన్‌ (పరిపాలన) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయకుమార్‌, సి.ప్రతాప్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి మునిరత్నంలతో పాటుగా పలువురు పోలీస్‌ అధికారులు, మినిస్టీరియల్‌ విభాగం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement