Friday, May 10, 2024

‘విక్రమ్’ నుండి ‘అంటే సుందరానికి’.. వీకెండ్ OTT వాచ్‌లిస్ట్ ఇదే..!

ఈ మధ్య కొత్త సినిమాలు పలు OTT ప్లాట్‌ఫామ్​లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ వీకెండ్ లో చిల్ అవ్వ‌డానికి చాలా ఇంట్రెస్టింగ్​ మూవీస్​ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో లేటెస్ట్​గా వచ్చిన కొత్త సినిమాలు, షోల సంగతులు ఏంటో చదివి తెలుసుకోండి..

1 ‘‘విక్రమ్​’’..

కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి లీడ్​ రోల్స్​లో నటించిన మూవీ విక్రమ్. ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఖైదీ మూవీకి రిలేటెడ్ గా ఉంటుంది. ఈ సినిమా కూడా ఆహా ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది.

2 ‘డియ‌ర్ ఫ్రెండ్’..

టోవినో థామస్, దర్శనా రాజేంద్రన్ న‌టించిన‌ తాజా మలయాళ సినిమా ‘డియర్ ఫ్రెండ్’ ఈ సినిమా ఆదివారం (జూలై 10) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. వినీత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, అర్జున్ రాధాకృష్ణన్, సంచనా నటరాజన్ ముఖ్య పాత్రల్లో న‌టించారు.

3 ‘అంటే సుందరానికి’..

నజ్రియా నజీమ్, నాని నటించిన ‘అంటే సుందరానికి’ థియేట్రికల్ విడుదలైన సరిగ్గా నెల తర్వాత ఆదివారం నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా నజ్రియాకి తెలుగు డెబ్యూట్ సినిమా ఇది. తమిళంలో ‘అదేడే సుందరా’, మలయాళంలో ‘ఆహ సుందరా’ పేరుతో రిలీజ్ అయ్యింది. థియేట‌ర్ ద‌గ్గ‌ర పాజిటివ్ రివ్యూలు దక్కించుకున్న ఈ సినిమా సుమారు బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లు కలెక్ట చేసినట్టు సమాచారం.

4 ‘మోడరన్ లవ్ హైదరాబాద్’..

తెలుగు ఆంథాలజీ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ శుక్రవారం అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. మోడరన్ లవ్ హైదరాబాద్‌లో రేవతి, సుహాసిని హాసన్, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రనిర్మాత నగేష్ కుకునూర్ మూడు ఎపిసోడ్‌లను డైరెక్ట్ చేశారు.. మిగిలిన వాటికి ఉదయ్ గుర్రాల, దేవిక బహుధనం, వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు.

- Advertisement -

5 ‘హర్దంగ్’..

బాలీవుడ్ చిత్రం హర్దంగ్ ఏప్రిల్ 8, 2022న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఆదివారం (జూలై 10) నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోంది. రిజర్వేషన్లు, విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద RRR కార‌ణంగా థియేటర్లలో రాణించ‌లేక‌పోయింది. ఈ సినిమాలో సన్నీ కౌశల్, నుష్రత్ భరుచ్చా ప్రధాన పాత్రల్లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement