Monday, May 20, 2024

TS | సీఎం రేవంత్ రెడ్డి‌కి ఈసీ నోటీసులు… కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సీఎం రేవంత్‌కి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో మోడల్‌ కోడ్‌ను ఉల్లంఘిస్తూ కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించేలా సీఎం రేవంత్‌ రెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడారని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకుంది. దీనిపై 48 గంటల్లో స‌మాదానం ఇవ్వాలని కాంగ్రెస్ కు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగాఎలాంటి వివరణ రాని పక్షంలో… తదుపరి సూచన లేకుండా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement