Saturday, April 27, 2024

ఇందూరులో సినీ నటి సందడి.. ఫారియాతో అభిమానుల‌ సెల్ఫీల హోరు

నిజామాబాద్ సిటీ (ప్రభ న్యూస్): జాతి రత్నాలు ఫేమ్ సినీనటి ఫారియా అబ్దుల్లా ఇందూరులో సందడి చేసింది. చిట్టి చిట్టి అంటూ అభిమానులు సెల్ఫీలతో ఒరెత్తించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఫారియాకు అభిమానుల తాకిడి పెరిగింది. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫారియా మాట్లాడుతూ నిజామాబాద్ కు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ప్రాంతానికి ఒక విశేషం ఉంటుందన్నారు. నిజామాబాద్ నగరానికి కూడా చాలా ప్రత్యేకత ఉందన్నారు. అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement