Saturday, May 4, 2024

ట్రెడిష‌న‌ల్ లుక్ లో నయన్-విగ్నేష్ జంట… క్యూట్ క‌పుల్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది విగ్నేష్ శివన్ ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని.. సరోగసి ద్వారా ఇద్ద‌రు పిల్లలకు జ‌న్మ‌నిచ్చారు. ఇక ఈ జంట వారి పిల్ల‌ల‌తో ఎక్కడ కనిపించినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంటారు. పిల్లలతో ఆడుకుంటున్న పిక్స్ ని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అయితే, తాజాగా నయనతార జంట తమ ఇంట్లో ఓనమ్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. పిల్లలతో కలిసి ట్రెడిషనల్ గా అరటి ఆకుల్లో భోజనం చేస్తున్న పిక్స్ తో పాటుగా.. విగ్నేష్-నయన్ ల వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్స్ లో ఉన్న రొమాంటిక్ పిక్చర్స్ ని షేర్ చేసారు.

నయనతార-విగ్నేష్ లు చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించారు. లవ్లీ కపుల్, అందమైన జంట అంటూ నయనతార-శవిగ్నేష్ జంటని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పిల్లల మొహాలని ఎప్పటిలాగే రివీల్ చెయ్యకుండా వెనుకవైపు ఉన్న పిక్స్ పోస్ట్ చేసారు. తమ పిల్లలు ఉయిర్, ఉలగమ్ తో నయా-విగ్నేష్ ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement