Friday, May 10, 2024

ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు

నిజామాబాద్ (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు అన్నారు. నిజామాబాద్ ప్రగతి నగర్ లోని కాకతీయ పాఠశాల విద్యార్థులు గూపన్పల్లిలోని ఆదివారం ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడి వ్యవసా య క్షేత్రాన్ని సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను ఆయన వారికి వివరించారు. .

కాకతీయ పాఠశాలలోని మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు సుమారు 300 మంది విద్యా ర్థులు గుపన్పల్లిలోని వ్యవ సాయక్షేత్రాన్ని సందర్శించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు గల విషయాలను వివరించారు. విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై చిన్నికృష్ణుడు అవగాహన కల్పించారు. వరి వంగడాల రకాల గురించి తెలిపారు. వరి వంగడాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగం, ఓంకారంపై విద్యార్థులకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement