Wednesday, May 15, 2024

ఎఫ్3 సునీల్ పై లేటెస్ట్ అప్డేట్ !!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్2. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పాటు మంచి వసూళ్ళను రాబట్టింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కూడా వెంకటేష్ ,వరుణ్ తేజ్ లతోపాటు మెహరీన్ ,తమన్నా లు నటిస్తున్నారు. అలాగే కొత్తగా అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే సునీల్ పాత్ర పై అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడట సునీల్. అహ నా పెళ్ళంట సినిమా లోని కోట శ్రీనివాసరావు పాత్రను కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే సరికొత్త ఆలోచన తో అనిల్ రావిపూడి ఈ పాత్రను రెడీ చేశాడట. నిజానికి మొదట రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సునీల్ పేరు వినిపిస్తోంది. మరి చూడాలి ఆ పాత్ర ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement