Sunday, April 28, 2024

రాహుల్ రామ‌కృష్ణ.. కుమారుడి పేరు ఏంటో తెలుసా

గ‌త ఏడాది రాహుల్ రామకృష్ణ.. హరితను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు హరిత పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. కాగా తన కుమారుడి పేరేంటో ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. కుమారుడికి రుమి పేరు పెట్టినట్టు తెలియజేశాడు రాహుల్ రామకృష్ణ.తల్లి రుమిని ఎత్తుకున్న స్టిల్‌ను రాహుల్‌ రామకృష్ణ అందరితో పంచుకున్నాడు. ఇప్పుడీ స్టిల్‌ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కంగ్రాట్స్ అన్నా.. రుమికి స్వాగతం.. అని ఓ నెటిజన్ కామెంట్‌ పెట్టగా.. చిన్న రాహుల్ సార్ అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం లీడ్ రోల్‌లో ఇంటింటి రామాయణంలో నటిస్తుండగా.. విడుదలకు రెడీ అవుతోంది.విలేజ్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో.. IVY ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement